17 April, 2026 | 12:12 AM

29న మున్నూరు కాపు సంఘం ఎన్నికలు

15-06-2025 10:44 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘం(Munnur Kapu Sangam) తెలంగాణ రాష్ట్ర సంఘం ఎన్నికలు నిర్ణయించిన ప్రకారమే ఈనెల 29వతేదీన హైదరాబాదులో జరుగుతాయని మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీలం శ్రీనివాస్, చందా గోపి, జిల్లా ప్రధాన సలహాదారు తుంపిల్ల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి మద్దెల రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇందుకు సంబంధించి జూన్ నెల 6వ తేదీన ప్రకటన విడుదల చేయడం జరిగిందని, దీంతో ఆ రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, ఆదివారం ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన మాదిరిగానే సంఘం ఎన్నికలు షెడ్యూల్  ప్రకారం యధాతథంగా జరుగుతాయని వివరించారు.