09-07-2025 08:01:38 AM
చిన్న గొడవతో కత్తితో దాడి చేసిన నైబర్
అబ్దుల్లాపూర్మెట్: ఓ వ్యక్తిపై తన పక్కింటి వ్యక్తి కత్తితో దాడి చేయగా ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రం వెంకటేష్(40) తన కుటుంబంతో బాటసింగారంలో ని ఇందిరమ్మ కాలనీలో రెంటుకు నివాసం ఉంటున్నాడు. అయితే వెంకటేష్ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి రమేష్ తో అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇదే విధంగా గొడవ జరగడంతో ఆవేశానికి గురైన వెంకటేష్ రమేష్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో వెంకటేష్ కు గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటేష్ ను ఆస్పత్రికి తరలించి, రమేష్ ను అదుపులోకి తీసుకొని హత్య యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.