09-07-2025 07:58:43 AM
పెన్ పహాడ్ : మండలం లోని మహ్మదాపురం ఆవాసం లాల్ సింగ్ తండాలో( Lal Singh Thanda) గిరిజనలు సంప్రదాయ బద్ధంగా సీతలా భవాని పండుగ వేడుకలు(Sheetla Bhavani Festival celebrations) ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా బ్యాండు మేళాలు, డప్పు చెప్పుల నడుమ ఊరేగింపు తో వచ్చి గ్రామ శివారులోని దేవతలకు బోనాలు సమర్పించి యాటలు, కోళ్లు బలిచ్చారు. ఈసందర్బంగా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు భూక్య మంగమ్మ గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో భూక్య సందీప్ రాథోడ్, జయంత్ లాల్, సంధ్య, శ్రీనివాస్, జామ్లా, బిక్కు, లాలు, సతీష్ తదితరులు ఉన్నారు.