హత్య కేసు నిందితుడి ఎన్‌కౌంటర్
ఘజియాబాద్‌లో ఉద్రిక్తతలు
లక్నో, మే 31: యూపీలోని ఘాజియాబాద్‌లో బక్రీద్ రోజున సూర్య చౌహాన్ అనే విద్యార్థి హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. నగరం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు లొంగిపోవాలని హెచ్చ రించారు. పోలీసులపై కాల్పులకు తెగబడడంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పు ల్లో అసద్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అసద్‌పై పోలీసులు 50వేల రివార్డు కూడా ప్రకటించారు.
మరోవైపు ఈ హత్య కాస్త రెండు వర్గాల మధ్య భారీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తుండడంతో పోలీసులు అలర్టయ్యారు. హత్య గావించబడ్డ సూర్య చౌహాన్ ఇంటివద్ద భారీ ఎత్తున పోలీసులను మోహ రించారు. మే 28 బక్రీద్ రోజున అసద్ తన స్నేహితుడు అయిన సూర్యకు ఫోన్ చేసి రమ్మన్నాడు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని కత్తితో పొడిచి చంపాడు. ఈ హత్యలో అసద్‌తోపాటు మరికొంతమంది పాల్గొన్నారు. ఖోడా పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నవాబ్, ఫర్హాన్, అతిఫ్ అనే ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు.






