16 March, 2026 | 11:50 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ముగ్గురు పిల్లల తల్లిపై హత్యాచారం

10-11-2024 01:55 AM

మణిపూర్‌లో వరుస దారుణాలు

ఇంఫాల్, నవంబర్ 9: మణిపూర్‌లోని జిరిబమ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హ్మార్ తెగకు  చెందిన ముగ్గరు పిల్లలు ఉన్న 31ఏళ్ల వివాహితను గురువారం కొందరు దుండగులు అత్యాచారం చేసి,  కాల్చి చంపారు. అనంతరం ఆమె మృతదేహానికి నిప్పంటించారు. గ్రామంలో ని మరో 17ఇళ్లకు నిప్పంటించారు. జాతి వైరంలో భాగంగానే ఇంట్లో ఉన్న తన భార్యపై దుండగులు దా రుణానికి పాల్పడ్డారని పేర్కొంటూ వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మైతే తెగకు చెందిన వాళ్లే ఈ నేరానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫొరెన్సిక్ పరీక్షల కోసం మహిళ మృతదేహాన్ని పక్క రాష్ట్రమైన అస్సాంకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. విష్ణుపూర్ జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న మైతే తెగకు చెందిన మహిళను కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో కుకీ తెగ వారిని పోలీసులు అనుమానిస్తున్నారు.