16 April, 2026 | 7:58 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ముర్ము కంటతడి

21-06-2025 01:41 AM

అంధవిద్యార్థుల గీతాలపనతో భావోద్వేగానికి లోనైన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, జూన్ 20: డెహ్రాడూన్ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ నేపథ్యంలోనే డెహ్రాడూన్‌లోని అంధుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.

అక్కడ పలువురు అంధ విద్యార్థులు గీతాలు ఆలపించి, రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈక్రమంలోనే ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. దీని తర్వాత ఆమె మాట్లాడుతూ.. తన ప్రజాజీవితంలో అత్యంత హత్తుకొనే క్షణాల్లో ఇవి ఒకటన్నారు. కల్మషం లేని చిన్నారుల స్వరం, వారి బలం, స్ఫూర్తి భారతదేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.