2 May, 2026 | 9:22 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

13న మూసీ ఇన్వైట్సి

12-03-2026 01:29 AM

తాజ్‌కృష్ణ వేదికగా ప్రణాళికను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వానికి చిహ్నమైన మూసీ నదికి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. మూసీ నది పునరుజ్జీవనం రివర్స్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలను అధికారికంగా వెల్లడించేందుకు ఈ నెల 13న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో మూసీ ఇన్వైట్సి పేరిట ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సులో పాల్గొని మూసీ పునరుద్ధరణ ద్వారా నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ఆర్థిక కేంద్రంగా ఎలా తీర్చిదిద్దబోతున్నారో తన విజన్‌ను ఆవిష్కరించనున్నారు. మూసీ రివర్స్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో మూసీ నది గతాన్ని, వర్తమానాన్ని నిశితంగా విశ్లేషించనున్నారు. ఒకప్పుడు నగరానికి జీవనాడిలా ఉన్న మూసీ నది..

నేడు మురుగు కూపంగా మారి నగర పర్యావరణానికి ఎలా ముప్పుగా పరిణమించిందో ఈ వేదికపై వివరించనున్నారు. ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టును తొలి దశలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సులో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలను, నిర్మాణ ప్రణాళికలను వెల్లడించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది పునరుద్ధరణపై ప్రభుత్వ ఆలోచనలను పంచుకోవడంతో పాటు, హైదరాబాద్‌ను భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ మెగా సిటీగా మా ర్చేందుకు మూసీ ప్రాజెక్టు ఎంత కీలకం కాబోతుందో వివరించనున్నారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు ఈ చర్చలో పాల్గొంటారు. వీరితో పాటు అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, వాణిజ్య రంగ సంస్థల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.