12 March, 2026 | 7:29 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

సంగారెడ్డి బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

12-03-2026 01:29 AM

సంగారెడ్డి, మార్చి 11: సంగారెడ్డి బై పాస్ రోడ్డు విస్తరణ కోసం జరుగుతున్న పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం పరిశీలించారు. ఐబి గెస్ట్ హౌస్ నుండి ఆర్డీవో క్యాంప్ ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్లి పనులు జరుగుతున్న తీరును నిర్మాణ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఆర్డీవో ఇంటి వద్ద మూలపై సర్కిల్ రానున్న నేపథ్యంలో అక్కడ ఉన్న చెట్లను, నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఐబి గెస్ట్ హౌస్ నుండి మొదలుకుని బసవేశ్వర విగ్రహం వరకు జరుగుతున్న విస్తరణ పనుల్లో వేగం పెంచాలని, రోడ్డు పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు ఉండకూడదని కాంట్రాక్టర్ ను హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప ట్టణ అధ్యక్షుడు జార్జ్, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చై ర్మన్ షఫీ హఫీజ్‌తదితరులు పాల్గొన్నారు.