01-11-2025 08:42:16 PM
మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
కొత్తగూడెం,(విజయక్రాంతి): జనవరి -2026లో జరగనున్న జేఈఈ మెయిన్స్ కు హాజరయ్యే ముస్లిం విద్యార్ధులందరూ ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల అయినందున ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకున్నట్లైతే 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు.
కావున ముస్లిం విద్యార్దులు తమ సమీప మీ-సేవ కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొరకు ఆన్‌లైన్ చేసుకోవాలని కోరారు. జేఈఈ మేయిన్స్ కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 27 వరకు ఉన్నందున విధ్యార్దులు వెంటనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఈ- సేవా కేంద్రాలలో పొందాలన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందే క్రమంలో తహశీల్దార్ లు ఇబ్బందులు పెడితే 8520860785 నంబరుకు సంప్రదించాలని సూచించారు.