calender_icon.png 2 November, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు!

01-11-2025 08:41:28 PM

అలంపూర్: మధ్యాహ్న భోజనం అందించే వంట సిబ్బంది శుచి, శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రాఘవ, ఎంఈఓ శివప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మానవపాడు మండల కేంద్రంలోని  జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం క్రమం తప్పకుండా  విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలని ఫుడ్ కమిటీ సభ్యులకు సూచించారు. వంటశాల రూములను పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు  పరిశుభ్రంగా ఉంచుకోవాలని డ్రెస్ కోడ్ పాటించాలని  హెచ్చరించారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతాన్ని పలు రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివ శంకర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు,