మన శంకర వరప్రసాద్’ ఎఫెక్ట్...
- కుటుంబమంతా థియేటర్ ముందే
- వైరల్ అవుతున్న ఫొటో, వీడియోలు
లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాకు 60 మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మహానంద థియేటర్ కు వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘మన శంకర వరప్రసాద్’ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో ఫ్యామిలీ, బంధుమిత్రులు చిన్నారులతో కలిసి సినిమా చూడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సంక్రాంతి పండుగ పూట సినిమా హాల్ ముందు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్నారులతో జ్ఞాపకం కోసం అంతా కలిసి ఫోటో, వీడియోలను తీసుకొని ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులంతా ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన వీడియోలు, ఫొటోలు పట్టణంలో వైరల్ అయ్యాయి.




