1 July, 2026 | 8:53 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాలి

18-06-2025 12:00 AM

మందమర్రి, జూన్ 17: విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉం డాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని పట్టణ ఎస్సై రాజశేఖర్ కోరారు.  ప్రజల్లో ట్రాఫిక్ చట్టాల పై చైతన్యాన్ని పెంపొందించేందుకు మంగళ వారం పట్టణ  పోలీసుల ఆధ్వర్యంలో సింగరేణి పాఠశాల విద్యార్థులకు పాఠశాల ముం దు కోల్ బెల్ట్ రహదారిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ట్రాఫిక్ పోలీసుల విధులు, రోడ్డు భద్రతలో వారి పాత్ర, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, హెల్మెట్ ధరించకపోతే ఎదురయ్యే ప్రమాదాల గురిం చి విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి, వారికి విద్యార్థుల చేత మామిడి పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ మల్లేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.