1 July, 2026 | 10:04 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రైతు భరోసా పథకంలో నమోదు చేసుకోవాలి

18-06-2025 12:00 AM

మందమర్రి, జూన్ 17 : మండలంలోని నూతనంగా పట్టాదా ర్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి కోరారు. మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని  ప్రారంభించిందని, గత యా సంగి నుంచి ఇప్పటి వరకు నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతు లు, ఇదివరకే పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసాలో నమోదు కానీ రైతు లు, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా నమో దు అయిన రైతులు ఈ నెల 20లోపు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్ లతో పాటు ఫోన్ నెంబర్ జత పరచి  రైతు వేదికలో విస్తరణ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని, మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోరారు.