29-10-2025 12:00:00 AM
నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ
ములుగు, అక్టోబరు 28 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రం లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మొదటగా జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతను కలిగి ఉండాలని, పక్షపాతం లేకుండా సమానత్వం పాటించాలని బాధితులందరినీ ఒకే విధంగా చూడాలని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదే శాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ కోర్టులో ట్రయల్ లో ఉన్న కేసుల గురించి ఆరా తీసి ప్రతికేసులోను తప్పనిసరిగా సాక్షులకు ముద్దాయిలకు సమన్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నేర స్తులకు శిక్ష పడే విధంగా కోర్టు కానిస్టేబుల్ లు విధులు నిర్వహించాలని అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్, సస్పెక్ట్ షీటర్స్ గురించి ఆరా తీసి, వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలని, వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించా రు ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్‌ల వారీగా ఆరా తీసి కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి కేసులోనూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఫైల్ అప్డేట్ చేయా లని ఆదేశాలు జారీ చేశారు దొంగతనాలు ఆర్థిక నేరాలలో ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని పోగొట్టుకున్న నగదు లేదా వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలి అని ఆదేశించారు.