5 March, 2026 | 5:41 PM

Breaking News

వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి   •   ఇల్లు లేని నిరుపేదలకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం   •   108, 102 అంబులెన్స్‌ల తనిఖీ   •   విరిగిన రైలు ఇంజిన్ వీల్.. తృటిలో తప్పిన ప్రమాదం   •   భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్   •   నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •  

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

18-03-2025 08:07 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ లు ఏఎన్ఎంలు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వారు అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడంతో పాటు అంకిత భావంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందాలని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద కాంట్రాక్టు పద్ధతిన 26 మందికి, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ గా ఒకరికి నియామకం పత్రాలు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. చంద్రశేఖర్, సబ్ యూనిట్ ఆఫీసర్ చలపతిలు పాల్గొన్నారు.