1 July, 2026 | 11:13 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రభుత్వ పాఠశాలలను ఒక గ్రామం నుండి మరో గ్రామానికి తరలించకండి

17-06-2025 10:18 PM

డిఇఓ కు వినతి పత్రాన్ని అందజేసిన పిఆర్టియూ నాయకులు..

కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): ఒక గ్రామ పంచాయతీలోనే ప్రభుత్వ పాఠశాల ఉండగా మరో గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తరలించడాన్నీ నిలువరించడానికి కొరకు జిల్లా పిఆర్టియు నాయకులు మంగళవారం డీఈఓ రాజు(DEO Raju)కు వినతి పత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారక ముందే, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కారణాలతో, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కానీ ఈ విధంగా జరగడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలు మూసివేసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదువు అందని ద్రాక్ష పండు గానే మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఒక గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఉంటే మరొక గ్రామపంచాయతీలో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను వెళ్లకుండా ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులకు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చి ప్రభుత్వ పాఠశాలను కాపాడగలరని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. డిఈఓ కు విజ్ఞాపన పత్రం అందజేసిన వారిలో పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీ రాజం, సంఘ నాయకులు పాల్గొన్నారు.