calender_icon.png 23 January, 2026 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముత్యాలమ్మ తల్లి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవం

23-01-2026 05:44:34 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ ముత్తుస్వామి కాలనీలో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, నాయకులు రమేష్ చారి, తిరుపతి, అజయ్ కుమార్,  జంగిటి శ్రీనివాస్, సాయి నేత, కిషోర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.