23-01-2026 05:47:04 PM
చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి పట్టణంలోని గీర్వాణి విద్యాలయంలో వసంత పంచమి ఉత్సవాన్ని గురువు గారైన సత్తినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురువుగారు మాట్లాడుతూ... సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఈ వసంత పంచమి ఉత్సవం జరుపుకుంటామని, హిందూ సంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైన పండుగని, అక్షరాభ్యాసానికి అతి ముఖ్యమైన దినమని, పిల్లలకి అక్షరాభ్యాసము చేయిస్తే విద్యాభివృద్ధి కలుగుతుందని వివరించడం జరిగింది.
తదానంతరం గురువుగారి చేత నూతన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈరోజు ప్రవేశం పొందిన వారికి పాఠశాలలో ఉచిత ప్రవేశాలు కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్స్ కోడూరి నాగరాజు సిరిపురం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది