11 August, 2026 | 1:48 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ముత్తవరపు వెంకట రమణ

19-06-2025 10:46 PM

కోదాడ: కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన ముత్తవరపు వెంకటరమణ తెలంగాణలోని మొయినాబాద్ ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్(National Pharmacy Teachers Association) వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు నిన్న జరిగిన నామినేటెడ్ సభ్యులలో ఒకరిగా ముత్తవరపు వెంకటరమణను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నామినేట్ చేయడం జరిగింది.

గతంలో కూడా వీరు ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేయడం జరిగింది. వీరు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఎంపికైనందుకు నలగొండ మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండు రంగారావు, కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్, సొసైటీ చైర్మన్ నంబూరు సూర్యం, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్తవరపు రామారావు, ఫైనాన్స్ హనుమంతరావు తదితరులు ఆయన్ని అభినందించారు.