19-06-2025 10:43:31 PM
వాలీబాల్ కిట్ అందించిన ఎస్సై ఇనిగాల వెంకటేష్..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల ఎస్సై ఇనిగాల వెంకటేష్(SI Venkatesh) యువతకు ప్రేరణగా నిలుస్తూ యువకులను, క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలన్న సంకల్పంతో, తుపాకులగూడెం యువతకు వాలీబాల్ కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... యువత తమ ప్రతిభను క్రీడల ద్వారా పెంపొందించుకోవాలని, ఇందుకు పూర్తి మద్దతు తల్లిదండ్రులు కూడా ఇవ్వాలని కోరారు.
యువతకు స్ఫూర్తినిస్తూ వారిని సానుకూల మార్గంలో నడిపే దిశగా ఒక ముందడుగుగా అందిస్తుందని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులకు సహకరించడం ఆశ్రయం కల్పించడం చట్టరీత్యా నేరమని, సంఘ వ్యతిరేక శక్తులకు సహకరించి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అన్నారు. అనుమానాస్పద కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే, తమకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారికి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు.