3 July, 2026 | 11:07 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పోలీస్ స్టేషన్లో పరస్పర దాడులు

13-05-2026 02:57 PM

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు రాళ్లదాడులకు పాల్పడ్డాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ, ఓ వర్గం ఆందోళనకు దిగగా మరో వర్గానికి చెందిన వారు పోలీస్ స్టేషన్లో పరస్పర దాడులకు దిగారు. రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిల్ లో విసురు కోవడంతో పాటు పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లోనే దాడులకు దిగిన సమయంలో పోలీసులు పెద్దగా లేకపోవడం వల్ల అదుపు చేసే పరిస్థితి లేక గందరగోళంగా మారింది.