వంద శాతం నవ్వించే విష్ణు విన్యాసం
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 27న విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ ఈ మూవీ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఈ సినిమా చాలా రోజులు గుర్తుంటుంది.
ఫస్టాఫ్ అంతా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌కి సినిమా ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. పూర్తి అయ్యేసరికి మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఫ్యామిలీతో రండి.. 100% నవ్వుకుంటారు. ఆ బాధ్యత నాది” అన్నారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. “శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు ఏవైతే కోరుకుంటున్నారో అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సినిమా అదిరిపోతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అని చెప్పింది.
‘ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటార’ని డైరెక్టర్ మారుతి తెలిపారు. ‘విష్ణు విన్యాసాలు చాలా బాగుంటాయ’ని నిర్మాత సుబ్రహ్మణ్యం చెప్పగా, మరో నిర్మాత సుమంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో విష్ణు టైమింగ్ మామూలుగా ఉండదు. 27న అందరూ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు కేకే రాధామోహన్, మ్యూజిక్ డైరెక్టర్ రధన్, బెక్కం వేణుగోపాల్, తదితర చిత్రబృందం పాల్గొన్నారు.




