10 March, 2026 | 3:31 PM

నాచగిరి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

09-03-2026 01:17 AM

గిరి ప్రదక్షిణలో మాధవానంద సరస్వతి

గజ్వేల్, మార్చి 8: సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీనృసింహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చైర్మన్ రవీందర్ గుప్త ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ నారసింహుడు నడయాడిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని, దర్శిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి కలుగుతుందన్నారు. స్వామివారి జన్మ నక్షత్రళి స్వాతి నక్షత్రళి  పురస్కరించుకొని వైకుంఠ ద్వారం నుండి గిరి ప్రదక్షిణ చేయ డం పుణ్యకార్యమని, భగవన్నామ స్మరణతో మానసిక ప్రశాంతత దక్కుతుందన్నారు.

కార్యక్రమాల్లో ఆలయ అధికారి బెల్లంకొండ రంగాచారి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయ మోహన్, పాల కమండలి సభ్యులు  ఉషశ్రీ రాజశేఖర శర్మ, చందా నాగరాజు గుప్త, జగ్గయ్యగారి శేఖర్ గుప్త, శ్రీనివాస్, రుద్ర శ్రీహరి, గాలి కిష్టయ్య, సురేందర్ రెడ్డి, కర్రె పద్మ వెంకటేష్, సర్పం చ్లు సారిక యాదగిరి, రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల మంత్రో శ్చరణల మధ్య స్వామీజీ నాచగిరి వార్షిక బ్రహ్మోత్సవాలకు జ్యోతి ప్రజ్వలనతో అంకురార్పణ చేశారు.