28 June, 2026 | 2:09 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

పిలువని పేరంటానికి రావొద్దు!

09-03-2026 01:16 AM
  1. వస్తే జైలుకు పోవాల్సిందే
  2. మహబూబాబాద్‌లో బోర్డు పెట్టిన ఫంక్షన్‌హాల్ యజమాని

మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఇదేందయ్యా.. ఇట్లాంటి బోర్డు ఏడ చూడలే.. అనుకోవాల్సిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తారాసపడింది. పట్టణంలోని పలు ఫంక్షన్ హాళ్లలో జరిగే కార్యక్రమాలకు పిలువని పేరంటంగా అనేకమంది వస్తూ అప్పనంగా తిని వెళ్తున్నారని.. దీన్ని నివారించేందుకు ఓ ఫంక్షన్ హాల్ ఎదుట ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే అటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే జరిమానా విధిస్తామని బోర్డులు పెట్టడం వింత గొలుపుతోంది.

వివిధ ఫంక్షన్ హాల్లల్లో జరిగే వేడు కలకు 200 నుంచి 300 మంది పిలవని వ్యక్తులు వచ్చి తిని వెళ్తున్నారని, దీంతో ఫంక్షన్ హాల్‌లో వేడుకలు జరుపుకునేందు కు ప్రజలు వెనుకడుగు వేస్తున్నారని, తమ గిరాకీ తగ్గిందని ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వాపోతున్నారు. ఆహ్వానం లేని వారిని అడ్డుకోవడానికి ఇలా బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు.