calender_icon.png 17 August, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగాలాండ్ గవర్నర్ కన్నుమూత

16-08-2025 12:16:47 AM

చెన్నై అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన గణేశన్

చెన్నై, ఆగస్టు 15: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ (80) ఆరోగ్య సంబంధిత సమస్యల తో కన్నుమూశారు. శుక్రవారం సాయం త్రం 6.23 గంటలకు చెన్నైలోని అపోలో ఆ స్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1945 ఫిబ్రవరి 16న తంజావూరులో జన్మించిన గణేశన్ చిన్ననాటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకైన కార్యకర్త. 1991లో బీజేపీలో చేరి తమిళనాడు సంస్థాగత కార్యదర్శిగా కూడా సేవ లందించారు.

2006 నుంచి 2009 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. 2021లో మణిపూర్ గవర్నర్‌గా ని యమితులై.. 2023 వరకూ కొనసాగారు. 2023 నుంచి నాగాలాండ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దే వ్ వర్మ విచారం, సంతాపం  వ్యక్తం చేశారు. 

ప్రధాని సంతాపం.. 

గణేశన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశా రు. ‘గణేశన్ జీ మరణం బాధాకరం. తమిళనాట బీజేపీని విస్తరించేందుకు ఆయ న చేసిన కృషి మరువలేనిది’ అని పేర్కొన్నారు.