16-08-2025 12:18:27 AM
అలస్కా సమావేశానికి ముందు ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, ఆగస్టు 15: అలస్కా భేటీ రష్యా కాల్పుల విరమణ కుదరకపోతే సంతోషంగా ఉండను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపితేనే రష్యాతో వాణిజ్యం చేస్తామని.. అప్పటి వరకు ఎటువంటి వాణిజ్యాలు ఉండవని తెలిపారు. పుతిన్‌తో భేటీకై వెళ్తుండగా.. విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ చర్చల ద్వారా కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ పుతిన్ భేటీపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ఇది యుద్ధం ముగించాల్సిన సమయం అన్నారు. అలస్కాలో ఈ ఇద్దరు నేతల నడుమ సమావేశం జరగనుంది.