2 May, 2026 | 6:39 AM

నాగార్జున కన్‌స్ట్రక్షన్ లాభం 5,382 కోట్లు

07-02-2025 12:53 AM

హైదరాబాద్( విజయక్రాంతి):  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడోత్రైమాసికంలోనాగార్జున కన్‌స్ట్రక్షన్ (ఎన్‌సీసీ) లిమిటెడ్ రూ. 5,382.86 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 5,287.74 కోట్లుగా ఉంది. కాగా ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ రూ.16,165. 55 కోట్లుగా ఉంది.

గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ టర్నోవర్  రూ.14,440.86 కోట్లుగా ఉంది. కాగా గత ఏడాది ఏప్రిల్‌నుంచి డిసెంబర్ దాకా తొమ్మిది నెలల కాలంలో ప్రతిషేరుపై రాబడి రూ.7.51గా ఉండగా, ఇప్పుడది రూ.9.02కు పెరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ. 8,440 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకొంది.