12-11-2025 10:39:31 PM
మోతె: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మోతె మండల శాఖ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పబ్బతి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. పిఆర్సిని వెంటనే ప్రకటించాలని పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని అలాగే ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కొచ్చర్ల వేణు జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద భాస్కర్ పాల్గొన్నారు.
ఎన్నికల అధికారిగా చెరుకు సింహాద్రి పరిశీలకులుగా పబ్బతి వెంకటేశ్వర్లు వ్యవహరించి ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులుగా ఆర్ నాగయ్య, ఉపాధ్యక్షులుగా అనంతుల వెంకన్న, చెకిలం కవిత,ప్రధాన కార్యదర్శిగా పి వీరాంజనేయులు ,కార్యదర్శి రాంబాబు, ఎం జానయ్య, బి శ్రీనివాసచారి, జిల్లా కౌన్సిలర్స్ గా చెరుకు సింహాద్రి , వనజ ,నాయకపు పరమేష్, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా గురిజాల రమేష్ సభ్యులుగా సిహెచ్ రాజేశ్వరి, క్రాంతి కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.