నేడు సుదర్శన్‌రెడ్డికి సన్మానం
-కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలి
-నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని కాంగ్రెస్ భవ న్‌లో బుధవారం రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాను అభివృద్ధిలో ముం దుకు తీసుకువెళ్లాలని సుదర్శన్‌రెడ్డికి ముఖ్య సలహాదారులుగా నియమించారని, అందు కు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కు మార్‌గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడికి మంత్రి హోదా ఇ వ్వడం సంతోషకరమన్నారు.
ముఖ్య సలహాదారులుగా నియమితులైన తర్వాత మొదటిసారి జిల్లాకు సుదర్శన్‌రెడ్డి వస్తున్నందున ఘన స్వాగతం పలుకుతామన్నారు. మాధవ్ నగర్ సాయి బాబా మందిరం నుంచి బైక్ ర్యాలీ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం అవుతుందని చెప్పారు. అక్కడి నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్య కర్త సభలో పాల్గొని విజయవంతం చేయాలని మానాల మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.






