14 May, 2026 | 5:44 PM

బోథ్ మండలకాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా నల్ల శ్రీకాంత్ రెడ్డి నియామకం

14-05-2026 04:44 PM

బోథ్ . మే 14 (విజయక్రాంతి): మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా మండలంలోని దన్నూర్ గ్రామానికి చెందిన నల్ల శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ డిసిసి అధ్యక్షులు డాక్టర్ నరేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.. గత పది సంవత్సరాల కాలంగా మండల పార్టీ కన్వీనర్ పోస్టులు భర్తీ చేయకుండా ఇన్చార్జిలుగా నియమిస్తూ వచ్చారు. చివరికి ఎట్టాకేలకు కన్వీనర్ లనియామకం చేపట్టడంతో పార్టీ పటిష్టతకు దోహదపడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. మండల కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన వారు పార్టీ పటిష్టత కోసం పాటుపడాలని జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు.