calender_icon.png 30 September, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ విశ్వవిద్యాలయం విద్యా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నల్లాని శ్రీనివాస్

30-09-2025 02:31:57 AM

కాకతీయ యూనివర్సిటీ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ విద్యా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్గా, ఇంచార్జ్ విభాగాధిపతి (దూర విద్య) గా డాక్టర్ నల్లాని శ్రీనివాస్ను నియమిస్తూ, వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఒక సంవత్సరం లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుత ఇంచార్జ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం నుండి స్వీకరించారు. డాక్టర్ శ్రీనివాస్ నియామకాన్ని బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులు గౌరవపూర్వకంగా అభినందించారు.