30-09-2025 02:33:18 AM
కాకతీయ యూనివర్సిటీ సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగ పాఠ్య ప్రణాళిక అద్యక్షులు గా సీనియర్ గణిత శాస్త్ర ఆచార్యులు ఆచార్య పి. మల్లారెడ్డి ని వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం రెండు సంవత్సరాల కాలానికి నియమించారు. ఆచార్య పి. మల్లారెడ్డి గారు ప్రస్తుత పాఠ్య ప్రణాళిక అధికారి డాక్టర్ బి.ఎస్.ఎల్. సౌజన్య నుంచి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఆచార్య పి. మల్లారెడ్డి 2010-12 కాలంలో మొదటిసారిగా పాఠ్య ప్రణాళిక అద్యక్షులు గా సేవలు అందించారు. పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు ఆచార్య పి. మల్లారెడ్డి ని అభినందించారు.