14 July, 2026 | 6:15 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్

13-11-2024 01:28 PM

భజంగరావు మధ్యంతర బెయిల్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని భుజంగరావు కోర్టులో పిటిషన్ వేశారు. రేపు సాయంత్రం  4 గంటల లోపు కోర్టు ఎదుట హాజరుకావాలని ధర్మాసనం ఆవేశించింది. గతంలో అనారోగ్య కారణాలతో భుజంగరావు మధ్యంతర బెయిల్ పొందారు. రేపటితో ఆయన మధ్యంతర బెయిల్ ముగియనుంది.