నమీబియా అధ్యక్షురాలిగా నంది
దేశ చరిత్రలో తొలిమహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఆఫ్రికా దేశాల్లో ఒకటైన నమీబియాలో నంది చరిత్ర సృష్టించారు. గతంలో దేశ ఉపరాష్ట్రపతిగా పని చేసిన ఆమె దేశాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల ప్రకారం స్వాపో(ఎస్‌డబ్ల్యూఏపీఓ) పార్టీకి చెందిన నంది న్డుత్వైనికి 57శాతం ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ చేంజ్ (ఐపీసీ) పార్టీకి చెందిన ఇటుల ఈ ఎన్నికల్లో కేవలం 26శాతం ఓట్లు మాత్రమే పొందారు.
అయితే ఈ ఎన్నికల ఫలితాలపై ఐపీసీ అనుమానం వ్యక్తం చేసింది. ఫలితాలను కోర్టులో సవాలు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం 72ఏళ్ల వయసున్న నంది 1960ల్లో స్వాపో పార్టీలో చేరి నమీబియా స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. దక్షిణాఫ్రికా నుంచి 1990లో నమీబియా స్వాతంత్య్రం పొందింది.






