బంగ్లాలో ఉగ్రదాడులకు అవకాశం
ట్రావెల్ అడ్వైజరీలో బ్రిటన్ ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. బంగ్లాలో పర్యటించాలనుకునే బ్రిటన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం తమ ట్రావెల్ అడ్వైజరీని సవరించింది. దేశంలోని కొన్ని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు కుట్ర జరుగుగుతుందని తెలిపింది.
బంగ్లాలో తరచూ మైనార్టీలపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనమని పేర్కొంది. అయితే, దాడులను అడ్డుకోవడానికి ఆ దేశ అధికారులు, భద్ర తా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలుపుతూ ఓ నోటీసు ను విడుదల చేసింది. కాగా, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలపై తరచూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.






