తిరుమలలో భక్తుల రద్దీ
16-06-2024 10:51 AM
అమరావతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. 82,886 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.4.09 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.






