గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
09-06-2024 04:03 PM
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెయిన్ బో స్కూల్, ఎస్.వి.ఎస్. మెడికల్ కాలేజి, ఎం.వి.ఎస్. కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదివారం సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.






