calender_icon.png 23 December, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నరేష్ కుమార్

23-12-2025 08:28:37 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): భారత ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ సర్కిల్ కు చెందిన నర్సింగోజు నరేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వo  లా అండ్ జ్యుడిషియల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తనను స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించడం సంతోషకరంగా ఉందని, తన పదవికి పూర్తి న్యాయం చేస్తానని నరేష్ కుమార్ తెలిపారు. కౌన్సిల్ మెంబర్ గా నియమించిన కేంద్ర ప్రభుత్వానికి, సహకరించిన సీనియర్ న్యాయవాదులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.