calender_icon.png 23 December, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి అదృశ్యం

23-12-2025 08:24:30 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): వాకింగ్ కి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలం విహారిక కాలనీలో నివాసం ఉండే ఉల్లిగొండ్ల రాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన తండ్రి ఎల్లయ్య (85) ఈ నెల 17 న అచ్చంపేట నుండి వచ్చాడు. 18న రాత్రి 8.30 గంటలకు వాకింగ్ కోసమని బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు రాజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసికొని  దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి  తెలిపారు.