9 June, 2026 | 1:19 AM

వ్యవసాయాభివృద్ధికి నర్మదా క్రాప్ కేర్ కట్టుబాటు

09-06-2026 12:20 AM

సంస్థ చైర్మన్ తిప్పా రెడ్డి

మొయినాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): వ్యవసాయ రంగ అభివృద్ధికి నాణ్యత, విశ్వసనీయత, నవీనతను ప్రాతిపదికగా చేసుకుని నర్మదా క్రాప్ కేర్ సంస్థ పనిచేస్తోందని సంస్థ చైర్మన్ తిప్పా రెడ్డి తెలిపారు. మొయినాబాద్ మండలంలోని అజీజ్నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సంస్థ లక్ష్యాలు, సేవల గురించి వివరించారు.

ఈ సందర్భం గా తిప్పా రెడ్డి మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భా వం నుంచి రైతులకు నాణ్యమైన అగ్రో కెమికల్ ఉత్పత్తులను అందిస్తూ వ్యవసాయ ఉ త్పాదకత పెంపునకు తోడ్పడుతున్నామని అన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.సంస్థ విజయాల్లో ఉద్యోగుల అంకితభావంతో పాటు వినియోగదారులు చూపుతున్న విశ్వాసమే ప్రధాన బలమని పేర్కొన్నారు.

అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ ధ్యేయమని చెప్పారు. వ్యవసాయ రసాయనాల రంగం లో అగ్రగామి సంస్థగా ఎదగడమే కాకుండా, రైతులతో దీర్ఘకాలిక అనుబంధాన్ని కొనసాగిస్తూ బాధ్యతాయుత వ్యవసాయ విధానా లను ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యాపార వృద్ధితో పాటు రైతుల జీవితాల్లో సానుకూ ల మార్పు తీసుకురావడమే నిజమైన విజయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్య వసాయాభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం అందిస్తామని స్పష్టం చేసిన తిప్పా రెడ్డి, సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న వినియోగదారులు, వ్యాపార భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.