మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నర్సిములు
12-06-2026 12:00 AM
భూత్పూర్, జూన్ 11: మండల ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నర్సిములును గురువారం ఎన్నుకున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్, జిల్లా ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు పసుల రాజు ల ఆధ్వర్యంలో భూత్పూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి వరుసగా నాలుగోసారి భూత్పూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






