19-05-2024 02:10:41 AM
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసానికి 2/3పైగా మద్దతు
త్వరలోనే చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల
రాజేంద్రనగర్, మే 18 : రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట్ మండలంలోని నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లపై అవి శ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 2/3 పైగా మెజార్టీ సభ్యులు మద్దతు ఇవ్వడంతో అవిశ్వాసం నెగ్గింది. మొత్తం మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్లు ఉండ గా 12మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పత్తి శ్రీకాంత్, స్వతంత్ర కౌన్సిలర్ యాదమ్మలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చా రు.
గోవా కేంద్రంగా సాగిన రాజకీయం నెగ్గింది. అవిశ్వాసం నెగ్గుతున్నదని బీఆర్‌ఎస్ చైర్మన్ రేఖాయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్‌యాదవ్ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో మొత్తం 14మంది అవిశ్వాసానికి మద్ధతు ఇచ్చినట్లుంది. నూతన మున్సిపల్ చైర్మన్‌గా నాగపూర్ణ శ్రీనివాస్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత అవిశ్వాస తీర్మానం నెగ్గిన అంశాన్ని కలెక్టర్‌కు వివరిస్తామని, త్వరలోనే చైర్మన్, వైస్ చైర్మన్లను కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నుకునే కార్యక్రమం ఉంటుందని వివరించారు.