calender_icon.png 22 September, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్ప కళాకారుడికి జాతీయ పురస్కారం

22-09-2025 01:31:23 AM

కుభీర్, సెప్టెంబర్ 21: నిర్మల్ జిల్లా కుభీర్‌కు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు పర్వత్వార్ సాయి శ్యాంకు శిల్పకళా రంగం లో చేస్తున్న విశేష కళకుగాను హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శ్రీ గౌతమేశ్వర కళా సేవా సంస్థ, శ్రీ ఆర్యాణి సకల కళావేదిక సం యుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి 2025 కీర్తి చక్ర పురస్కారాన్ని అందించారు.

ఇటీవ ల నిర్మల్‌లో ప్రభుత్వ పంచాయతీరాజ్ ఇం జినీరింగ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వర య్య విగ్రహా న్ని కృష్ణశిలతో అపురూపంగా చెక్కారు. దీంతో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.