22-09-2025 01:29:55 AM
ఆందోళనలో గ్రామస్తులు
మందమర్రి, సెప్టెంబర్ 21: మండల కేంద్రం నుంచి నెన్నెల, భీమారం మండలాలకు వెళ్ళే గ్రామీణ రహదారి మామిడిగట్టు శివారులో భారీ గుంతలతో ప్రమాదాలకు నిలయంగా మారింది. మండలంలోని సా రంగపల్లి, చిర్రకుంట, ఆదిల్‌పేట, పొన్నారం, మామిడిగట్టు, గ్రామాల ప్రజలతో పాటు నెన్నెల,
భీమారం మండలాల ప్రజలు మం దమర్రి మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఈ రహదారి గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. గ్రామీణ రహదారి గుంతలు పడి ప్రమాదకరంగా మారడం పట్ల వాహనదారులు, మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నాసిరకం పనుల మూలంగా...
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం భాగంగా గ్రామాలకు రహదారుల వ్యవస్థను మెరుగుపరిచింది. మండల కేంద్రం నుంచి మామిడిగట్టు వర కు 10 కిలో మీటర్ల పిడబ్ల్యూడి రోడ్ బిటి రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాసిరకంగా పూర్తి చేయడంతో రహదారిపై గుంత లు పడి అధ్వాన్నంగా మారాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
తరచూ ప్రమాదాలు..
గుంతల మయమైన రహదారితో ప్రాణాల చేతిలో పెట్టుకొని, ప్రయాణాలు చే యాల్సి వస్తుందని అత్యవసర సమయాల్లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ రహదారి ప్రయాణం మరింత నరకప్రాయంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ర్ట మంత్రి డాక్టర్ గడ్డం వివేక స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజక వర్గంలో గ్రామీణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి, రహదారికి మరమ్మతులు నిర్వహిం చి, మెరుగైన సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.