calender_icon.png 22 September, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులను ఆదుకోవాలి

22-09-2025 01:32:45 AM

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ర్ట గౌరవ అధ్యక్షుడు వంగూరి రాములు

కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికులకు జీవో నెంబర్ 12ను  సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సహజ, ప్రమాద మరణ,  పాక్షిక, పూర్తి అంగవైకల్యం లకి ఇచ్చే సంక్షేమ నిధులను ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ర్ట గౌరవ అధ్యక్షుడు వంగూరి రాములు అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా 3వ మహాసభలు ఆదివారం జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వంగూరి రాములు మాట్లాడుతూ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన 346 కోట్ల రూపాయలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వెల్ఫేర్ బోర్డు అడ్వుజర్ కమిటీని అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులు నియమించాలని, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 55 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, కార్యదర్శి అశోక్, ఆనంద్ రావు, రామచందర్, వెంకన్న, మహేష్, సదయ్య, బాలాజీ, కమలాకర్, రమేష్ జిల్లాలోని కార్మికులు తదితరులు ఉన్నారు.