calender_icon.png 16 October, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారి భూముల రీ సర్వే

15-10-2025 10:28:03 PM

మండల తహశీల్దార్ సతీష్ కుమార్

మందమర్రి (విజయక్రాంతి): మండల పరిధిలోని జాతీయ రహదారి 63లో భూములు కోల్పోయిన పలువురు రైతులకు సరైన న్యాయం జరగలేదనే అభ్యర్థన మేరకు రీ సర్వే నిర్వహించడం జరుగుతుందని మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో భూములు కోల్పోయిన వారు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేసిన అభ్యర్థన మేరకు తిరిగి సర్వేను చేపట్టడం జరుగు తుందని తెలిపారు.

ఈ సర్వే నిర్వహణ కొరకు  పలువురు బాధితులను మున్సిపల్ సిబ్బంది ఫోన్లో సంప్రదించాలని ప్రయత్నించినప్పటికి వారి ఫోన్ నెంబర్లు కలవడం లేదన్నారు. కొంతమంది అందుబాటులో లేక దూర ప్రాంతాలలో నివాసం ఉంటున్నారన్నారు. భూములు కోల్పోయిన వారు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ దరఖాస్తులు అందించారన్నారు. జాతీయ రహదారి 63 కింద భూములు కోల్పోతున్న వారు తహశీల్దార్ కార్యాలయంలో వారం రోజుల లోపు సంబంధిత పత్రాలతో సంప్రదించాలని కోరారు.