15-10-2025 10:26:37 PM
నేరేడుచర్ల (విజయక్రాంతి): స్థానిక నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, నేరేడుచెర్ల యూనిట్ కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే జనిమియా, దున్న శ్యామ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూనిట్ అధ్యక్షులుగా జి.రాంబాబు, కార్యదర్శిగా బి.సురేందర్ రెడ్డి, కోశాధికారిగా మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా చందు నాయక్, చంద్రమ్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అన్వేష్, జాయింట్ కార్యదర్శిగా కే.గోపి, జయమ్మ, పబ్లిసిటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఈసి మెంబర్లుగా విజయ, వెంకటేశం, పి.గోపి లను ఎన్నుకోవడం జరిగింది.
ఇట్టి కార్యవర్గ సమావేశం నందు TNGO'S రాష్ట్ర నాయకులు పోటు వెంకటేశ్వర్ రావు, మదిపడగా సైదులు, శ్రవణ్ కుమార్, వెంకటయ్య, అల్లి సతీష్, నరేష్ నాయక్, డి.బాలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే.జనిమియా, దున్న శ్యామ్ లు మాట్లాడుతూ ఉద్యోగులందరూ సంఘటితంగా ఉండాలని, మన హక్కుల కోసం పోరాడాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు.