జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం
హయాత్‌నగర్ కోర్టులో నిర్వహణ
హయాత్‌నగర్, జూన్ 20(విజయక్రాం తి): జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమా న్ని శనివారం హయాత్‌నగర్ కోర్టులో నిర్వహించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ సిరిసిల్ల ప్రియాంక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, ఇరు పార్టీలు కలిసి వస్తే రాజీ చేస్తామ ని తెలిపారు. అదేవిధంగా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుంటే అప్పీల్ ఉండదని, మేజిస్ట్రేట్ ఫర్హీన్ బేగం, అదనపు జూనియర్ సివి ల్ జడ్జి పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ న్యా యవాది రమేష్, మార్నింగ్ కోర్టు మేజ్రిస్టేట్ భరత్‌రెడ్డి, బెంచ్ మెంబర్స్ ఎన్. సత్యనారాయణ, టీ ఈశ్వర్‌గౌడ్, టీ భార్గవి, సైదిరెడ్డి, పీ యాదయ్య, హయాత్‌నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.లింగంగౌడ్, జనరల్ సెక్రటరీ ఏ.రాంమోహన్, వైస్ ప్రెసిడెంట్ పంతుల్ ప్రవీణ్, ఏసీపీ హయత్‌నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐలు, అడ్వకేట్స్, కోర్టు సిబ్బంది, ఆడిటర్లు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌ను అందరూ కలిసి విజయవంతం చేశారు.






