సిద్ధార్థ ఎంబీఏ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన
మస్కతి డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశీలించిన విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 20(విజయక్రాంతి): ఇబ్రహీపట్నంలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ) విభాగానికి చెందిన విద్యార్థులు, డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ సీ హెచ్ ప్రకాష్‌రెడ్డి, అధ్యాపకులు శనివారం పారిశ్రామిక సందర్శన కార్యక్రమంలో భా గంగా యంజల్‌లో ఉన్న మస్కతి డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సందర్శించారు.
ఈ సందర్శన ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు పరిశ్రమ లలో అమలవుతున్న ఆధునిక నిర్వహణ వి ధానాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మార్కెటింగ్ వ్యూహాలు, వ్యాపార నిర్వహణ అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం. సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు సంస్థ చరిత్ర, అభివృ ద్ధి ప్రస్థానం, పాల ఉత్పత్తుల పరిశ్రమలో సంస్థ సాధించిన విజయాల గురించి వివరించారు. సందర్శన సందర్భంగా విద్యార్థులు ఉత్పత్తి విభాగాన్ని పరిశీలించి, ముడి పదార్థాల సేకరణ నుంచి తుది ఉత్పత్తి తయారీ వరకు జరిగే వివిధ ప్రక్రియలను ప్రత్యక్షంగా గమనించారు.
అదేవిధంగా, సేల్స్, మార్కెటింగ్ విభాగాల పనితీరును తెలుసుకొని, ఉ త్పత్తులను వినియోగదారులకు చేరవేయడంలో అనుసరించే మార్కెటింగ్ వ్యూహాలు, బ్రాండ్ ప్రమోషన్, మార్కెట్ విశ్లేషణ, వినియోగదారుల సంతృప్తి సాధనకు చేపట్టే చర్యల గురించి అవగాహన పొందారు.
ఈ పారిశ్రామిక సందర్శన విద్యార్థులకు తరగతి గదిలో నేర్చుకున్న సైద్ధాంతిక అంశాలను ప రిశ్రమలలో అమలవుతున్న విధానాలతో అ నుసంధానించుకునే అవకాశాన్ని కల్పించింది. పరిశ్రమల నిర్వహణ, ఉత్పత్తి ప్రణాళి క, మానవ వనరుల నిర్వహణ, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై విలువైన అనుభవాన్ని అందించింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగా, వి ద్యార్థులు, అధ్యాపకులు సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.






