మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ
24-04-2026 04:37 PM
దేవరకొండ,(విజయక్రాంతి): మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అమ్మ టోనీగూడెం గ్రామ సర్పంచ్ ఆడారపు హరికృష్ణ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం అమ్మ టోనీగూడెం గ్రామంలో ఆయన అధ్యక్షతన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు స్వచ్ఛతపై అవగాహన పెంచుకొని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి. సరిత, ఉప సర్పంచ్ రమావత్ అంజలి, సోమ్లా నాయక్, వార్డు సభ్యులు సైదులు, రమణమ్మ, మురళమ్మ తదితరులు పాల్గొన్నారు.






